పూడికతీత పనులను పర్యవేక్షించిన రంగనాథ్
HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్, బోరబండ ప్రాంతాల్లో నాలాల్లో పూడికతీత పనులను శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యవేక్షించారు. వారు మాట్లాడుతూ.. నాలాల్లో పూడికతీత పనులకు, వరద ప్రవాహానికి ఆటంకాలను తొలగించేందుకు ఇదే సరైన సమయంగా భావించాలన్నారు. ప్రాంతాల వారి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి సమాచారాన్ని చేరవేయాలని అధికారులకు సూచించారు.