మల్లన్న సన్నిధిలో డైరెక్టర్ సుకుమార్

మల్లన్న సన్నిధిలో డైరెక్టర్ సుకుమార్

NDL: ప్రముఖ సినీ డైరెక్టర్ సుకుమార్ సోమవారం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం వేద ఆశీర్వచనాలు చేసి లడ్డు ప్రసాదాలు అందజేశారు.