ఆదరణ పథకంపై అవగాహన సదస్సు

ఆదరణ పథకంపై అవగాహన సదస్సు

KDP: చిట్వేల్ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఆదరణ పథకంపై వివిధ కులాలకు చెందిన చేతివృత్తుల వారికి ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఆదరణ పథకం మూడో విడత ద్వారా కుల వృత్తుల వారికి పనిముట్లు పంపిణీ చేసేందుకు ఈ అవగాహన సదస్సు నిర్వహించామని MPDO రాధాకృష్ణన్ తెలిపారు. చేతివృత్తుల వారికి కావాల్సిన పనిముట్ల గురించి అవగాహన కల్పించామని ఎంపీడీవో వివరించారు.