రాజమండ్రిలో మహిళ హత్య.. ముగ్గురికి జీవిత ఖైదు

రాజమండ్రిలో మహిళ హత్య.. ముగ్గురికి జీవిత ఖైదు

తూ.గో: రాజమండ్రికి చెందిన మహిళ హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు పడింది. 2013 డిసెంబర్ 2న లక్ష్మీవారపు పేటకు చెందిన నాగభారతిని మహేశ్, లక్ష్మణరావు బంగారం కోసం హత్య చేశారు. మహిళ భర్త ప్రసాదరావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాదనలు విన్న పదో అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు కమ్ ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు.