బస్టాండ్ వద్ద మహిళల ధర్నా..

బస్టాండ్ వద్ద మహిళల ధర్నా..

KMR: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్సు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కొత్త బస్టాండ్ ఎదుట కొంతమంది మహిళలు ధర్నా చేపట్టారు. ‘‘ఈ పథకం మాకు వద్దు.. ఈ కాంగ్రెస్ పాలన వద్దని, సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్’’ అంటూ నినాదాలు చేశారు. పథకం వచ్చినప్పటి నుంచి మహిళలకు బస్సుల్లో సీట్లు దొరకట్లేదని.. దీంతో అవస్థల పాలవుతున్నామని వారు వాపోయారు.