మచిలీపట్నం ప్రజలకు సీఐ కీలక సూచనలు
కృష్ణా: మచిలీపట్నం సీఐ ప్రజలకు కీలక సూచనలు చేశారు. శనివారం పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ, వేసవికాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వేసవి సెలవుల సందర్భంగా వేరే గ్రామాలకు, పట్టణాలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులకు సహకరించాలని ఆయన ప్రజలను కోరారు.