వర్షాలకు కూలిన భారీ చెట్టు.. ఉద్యోగి మృతి

వర్షాలకు కూలిన భారీ చెట్టు.. ఉద్యోగి మృతి

 AKP: పాయకరావుపేట మండలం కేశవరం గ్రామం వద్ద వర్షాలకు భారీ చెట్టు కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కడియపులంక మండలం దూళిపాలెం గ్రామానికి చెందిన తోట శ్రీనివాసరావు (40)గా గుర్తించారు. డెక్కన్ కెమికల్స్ కంపెనీలో పని చేస్తున్న శ్రీనివాసరావు బైక్‌పై డ్యూటీకి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. బైక్ వెనకాల కూర్చున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.