సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరతలేదు: కలెక్టర్
SRCL: జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిలిండర్ల పంపిణీ, స్టాక్ తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కమిటీ సభ్యులు, సిలిండర్ ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఎనర్జీ మానిటరింగ్ కమిటీ నిర్వహించారు.