విశాఖ వైసీపీ కార్యాలయంలో కార్యవర్గ సమావేశం

VSP: కృష్ణ కాలేజ్ రోడ్డులో గల వైసీపీ కార్యాలయంలో కార్యవర్గ సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆదివారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వైసీపీని బలోపేతం చేసేలా చూడాలని కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తనకి జిల్లా అధ్యక్షులు పదవి ఇచ్చి మరింత బాధ్యత పెంచారని అన్నారు.