రష్మిక లవ్‌స్టోరీపై దీక్షిత్ కామెంట్
రష్మిక, దీక్షిత్ శెట్టి నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే, రష్మిక ఎంగేజ్‌మెంట్ గురించి దీక్షిత్‌ను ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన దీక్షిత్.. రష్మిక వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో తనకు తెలియదని చెప్పాడు. ఆమె ప్రేమ, ఎంగేజ్‌మెంట్ గురించి తానెప్పుడూ ఆమెతో చర్చించలేదని వెల్లడించాడు.