మదనపల్లిలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు
AP: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టైంది. విశాఖకు చెందిన ఇద్దరు మహిళల కిడ్నీలను గ్లోబల్ ఆస్పత్రిలో అక్రమంగా తొలగించారు. ఆ ఇద్దరి మహిళలను విశాఖకు చెందిన పద్మ అనే మహిళా తీసుకొచ్చింది. ఆపరేషన్ తర్వాత ఆ ఇద్దరు మహిళల్లో ఒకరు చనిపోయారు. దీంతో ఈ దందా బయటపడింది. ఆస్పత్రి డాక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో కీలక నిందితుడిని నీరజ్‌గా గుర్తించారు.