నవోదయ పరీక్ష రాయనున్న 3,493 మంది విద్యార్థులు

నవోదయ పరీక్ష రాయనున్న 3,493 మంది విద్యార్థులు

ASR: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశానికి జిల్లాలో 3,493 మంది ఎంట్రన్స్ పరీక్ష రాయనున్నారని పరీక్షల కన్వీనర్ కేటీ ప్రసాద్ శుక్రవారం తెలిపారు. జిల్లాలో 16 కేంద్రాల్లో శనివారం పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఉదయం 11.30 నుంచి 1.30 గంటల వరకు 100 మార్కులకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఉ.10 గంటల వరకు కేంద్రాలకు చేరుకోవాలన్నారు.