VIDEO: సింగరేణి గనిలో అగ్ని ప్రమాదం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న సింగరేణి కేటీకే ఐదవ గనిలో బుధవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గనిలోని లాంప్ రూమ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కార్మికులకు చెందిన సుమారు 1300 లైట్లు పూర్తిగా కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై సింగరేణి అధికారులు విచారణ చేపట్టారు.