రోడ్డు దాటుతుండగా క్రేన్ ఢీ కొనడంతో వృద్ధురాలు మృతి

రోడ్డు దాటుతుండగా క్రేన్ ఢీ కొనడంతో వృద్ధురాలు మృతి

SRD: రోడ్డు దాటుతున్న ఓ వృద్ధురాలిని క్రేన్ ఢీ కొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కందిలో మంగళవారం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని లక్ష్మీనగర్ కు చెందిన లక్ష్మీబాయి (70) ఆర్టీఏ కార్యాలయం సమీపంలో రోడ్డు దాటుతుండగా అటుగా వచ్చిన క్రేను ఒక్కసారిగా ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన అనంతరం క్రేన్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయినట్లు స్థానికులు చెప్పారు.