రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరి మృతి

MDK: నర్సాపూర్ మండలం రుస్తుంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.