VIDEO: సోలార్ విద్యుత్ వ్యవస్థను ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: సోలార్ విద్యుత్ వ్యవస్థను ప్రారంభించిన ఎమ్మెల్యే

NTR: వీరులపాడు మండలం జుజ్జూరులో పీఎం సూర్య ఘర్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ వ్యవస్థను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సోలార్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. సోలార్ వినియోగంతో విద్యుత్ ఖర్చులు తగ్గడమే కాకుండా, అదనపు విద్యుత్తును ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు.