నేతలతో సమావేశం.. KTRకు ఘన స్వాగతం

నేతలతో సమావేశం..  KTRకు ఘన స్వాగతం

TG: నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా దీక్షాదివస్ నిర్వహించాలని BRS నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇవాళ హనుమకొండలో జరిగే సన్నాహక సమావేశంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పాల్గొననున్నారు. ఈ మేరకు జిల్లాకు చేరుకున్న ఆయనకు కరుణాపురం సమీపంలో పార్టీ నేతలు తక్కళ్లపల్లి రవీందర్, తాడికొండ రాజయ్య, దాస్యం వినయ్ తదితరులు ఘన స్వాగతం పలికారు.