అన్నామలై, తేజస్వి సూర్యపై మోదీ ప్రశంసలు
గోవాలో జరిగిన ఐరన్‌మ్యాన్ 70.3 వంటి కఠినమైన క్రీడా ఈవెంట్లలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇటువంటి సవాళ్లు 'ఫిట్ ఇండియా' ఉద్యమానికి మరింత దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వారిలో తమ పార్టీ నేతలు అన్నామలై, తేజస్వి సూర్య ఉన్నారని తెలిసి ఆనందంగా ఉందని మోదీ తెలిపారు.