పెట్రోల్ బంకుల వద్ద పెరిగిన రద్దీ
NRML: యుద్దం కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందని సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లతో నిర్మల్ పట్టణంలోని పెట్రోల్ బంకుల వద్ద మంగళవారం రాత్రి వాహనాల రద్దీ నెలకొంది. పెట్రోల్, డీజిల్ కొరత సమస్యతో ఆందోళనలో ఉన్న వినియోగదారులు ముందుగానే తమ వాహనాల్లో ఇంధనం నింపుకోవడానికి బంకుల వద్ద భారీ క్యూలైన్ లలో నిలబడ్డారు. మరికొందరు బాటిళ్లలో తీసుకెళ్లారు.