గంజాయి తోటలపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి

గంజాయి తోటలపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి

సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలోని సౌమ్య నాయక్ తండాలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న పీరు నాయక్ అనే వ్యక్తిపై టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడి చేశారు. పత్తి పంటలో అంతర్ పంటగా సాగు చేస్తున్న 105 గంజాయి మొక్కలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో సీఐ శంకర్, ఎస్సైలు హనుమంతు, అనుదీప్, సిబ్బంది పాల్గొన్నారు.