బీజేపీలో చేరిన వివిధ పార్టీల కార్యకర్తలు

బీజేపీలో చేరిన వివిధ పార్టీల కార్యకర్తలు

నారాయణపేట: నర్వ మండలం యాంకి గ్రామంలో ఆదివారం సాయంత్రం పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే భరతసింహారెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వీరికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ విధానాలు, మోడీ సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు బీజేపీలో చేరినట్లు తెలిపారు.