'రెండో విడత పోలింగ్ మండలాల్లో ప్రచారం నిషేధం'
NRPT: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్ మండలాల పరిధిలో ఈనెల 12 సాయంత్రం 5 గంటల వరకే ఎన్నికల ప్రచారం ముగించాలని, ఆ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి ప్రచార కార్యక్రమాలు నిషేధం అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పష్టం చేశారు. ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.