పంచాయతీలకు చెత్త ట్రాలీలను అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి
E.G: పారిశుద్ధ్య నిర్వహణతోనే ఆరోగ్యవంతమైన గ్రామాలు ఉంటాయని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. స్వచ్ఛ్ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బిక్కవోలు ఎంపీడీవో కార్యాలయం వద్ద మండలంలోని ఇళ్లపల్లి, అరికరేవుల, మెల్లూరు గ్రామపంచాయతీలకు తడి చెత్త, పొడి చెత్త ట్రాలీలను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అందజేశారు.