VIDEO: అరుదైన దృశ్యం.. ఒకే చోట వందలాది పాములు
కృష్ణా జిల్లా నాగాయలంకలో వింత ఘటన జరిగింది. పవిత్ర కార్తిక మాసంలో స్థానిక రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపానికి వందలాది నీటి పాములు తరలివచ్చాయి. ఆలయ పరిసరాల్లోని కృష్ణా నది ప్రవాహంలో పాములు గుంపులు గుంపులుగా సంచరిస్తున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దీనిని భక్తులు శివయ్య మహిమేనని భావిస్తున్నారు. ఈ అరుదైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.