గ్రామ సభలో ఉద్రిక్తత
SDPT: వర్గల్ మండలంలో నిర్వహించిన గ్రామ సభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఒకరి పై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకోవడంతో పరిస్థితి అదుపు తప్పేలా మారింది. కొంతసేపు సభ నిలిపివేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. గ్రామంలో మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై చర్చ జరగాల్సిన సమయంలో నాయకులు వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడం స్థానిక ప్రజలను నిరాశకు గురి చేసింది.