జగ్గంపేటలో 'రైడ్ ఫర్ క్రైస్ట్' బైక్ ర్యాలీ

జగ్గంపేటలో 'రైడ్ ఫర్ క్రైస్ట్' బైక్ ర్యాలీ

KKD: జగ్గంపేటలో శనివారం 'రైడ్ ఫర్ క్రైస్ట్' బైక్ ర్యాలీ జరిగింది. పాస్టర్స్ రివైవల్ ఫెలోషిప్ గౌరవాధ్యక్షులు వి.రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల పాస్టర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పునరుద్ధానుడైన క్రీస్తు శాంతి, సమాధానం, ప్రేమను ప్రజలకు తెలియజేయడానికి సుమారు 70 కి.మీ మేర ఈ ర్యాలీ నిర్వహించినట్లు పాస్టర్లు వి.రాంబాబు, సిహెచ్ యోహాను తెలిపారు.