విమాన సర్వీసును ప్రారంభించిన కేంద్ర మంత్రి

TPT: రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి, ఢిల్లీ ప్రత్యేక ఇండిగో విమాన సర్వీసును శనివారం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. కేంద్ర మంత్రి మొట్టమొదటిగా తొలి బోర్డింగ్ పాస్‌ను ప్రయాణికుడికి అందజేశారు. ప్రయాణికులు అందరూ ఈ విమానయాన సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి తెలిపారు.