పుజారా బావమరిది ఆత్మహత్య
టీమిండియా క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా బావమరిది జీత్ రసిక్‌భాయ్ పబారీ ఆత్మహత్య చేసుకున్నాడు. గుజరాత్ రాజ్‌కోట్‌లోని తన నివాసంలో విగతజీవిగా కనిపించాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.