బయోగ్యాస్ నిర్వహణను పరిశీలించిన కమిషనర్

సిద్దిపేట మున్సిపల్ పరిధిలో బుస్సాపూర్‌లోని రిసోర్స్ పార్క్ నందు బయో మైనింగ్, బయో గ్యాస్, సేంద్రియ ఎరువుల కర్మాగారం నిర్వహణను కమిషనర్ అశ్రిత్ కుమార్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రిసోర్స్ పార్కు నిర్వాణ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.