సింగారంలో ఘనంగా జరిగిన మల్లన్న జాతర

సింగారంలో ఘనంగా జరిగిన మల్లన్న జాతర

MDCL: ఘట్‌కేసర్ మండల కాచవాని సింగారం గ్రామంలో మల్లన్న జాతర అంగరంగ వైభవంగా జరిగింది. మాజీ మేడ్చల్ MLA మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, స్థానిక నేతలు ప్రజలందరూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లుగా తెలిపారు. జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యంత్రాంగం తగిన చర్యలు చేపట్టింది.