VIDEO: ఖమ్మం కలెక్టరేట్‌కు చేరుకున్న భట్టి, తుమ్మల
KMM: ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములలో అర్హులైన 311 మంది బాధితులకు స్థలాలు కేటాయింపు కార్యక్రమంలో భాగంగా బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. వారికి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్, ఇతర అధికారులు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు.