సకాలంలో ఆస్తి పన్ను చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్
NZB: బోధన్ పట్టణంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ యాదవ్ కృష్ణ ఆధ్వర్యంలో ఆస్తి పన్ను వసూలుకు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. దుకాణ సముదాయాల వర్తకులు, ప్రజలు సకాలంలో ప్రాపర్టీ టాక్స్ చెల్లించాలని సూచించారు. పన్ను చెల్లించడం వల్ల కలిగే లాభ, నష్టాలపై వర్తకులు, ప్రజలకు మున్సిపల్ కమిషనర్ అవగాహన కల్పించారు.