'వైసీపీ దుష్ప్రచారాన్ని పట్టించుకోవద్దు'
PLD: యడ్లపాడు మండలం జాలాది, ఉప్పరపాలెంలో బుధవారం రూ.20 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పుల్లారావు శంకుస్థాపన చేశారు. అమరావతిపై వైసీపీ దుష్ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటుందని తెలిపారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి ఎలాంటి ఢోకా ఉండదని ఆయన స్పష్టం చేశారు.