రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ గాయాలు

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ గాయాలు

E.G: గోపాలపురం మండలం చిట్యాల అన్నదేవరపేట గ్రామాల మధ్య గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ఇద్దరు చిట్యాల గ్రామానికి చెందినవారని స్థానికులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.