RCB vs CSK: విధ్వంసం సృష్టించిన షెపర్డ్

చిన్నస్వామి స్టేడియం వేదికగా CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో RCB బ్యాటర్ రొమారియో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. ఖలీల్ వేసిన 19వ ఓవర్‌లో ఏకంగా 33 పరుగులు రాబట్టాడు. దీంతో కేవలం 14 బంతుల్లోనే (53) హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది ఐపీఎల్‌లోనే రెండో వేగవంతమైన అర్ధశతకం కావడం విశేషం. కాగా, షెపర్డ్ విధ్వంసంతో చివరి రెండు ఓవర్లలో RCB ఏకంగా 54 పరుగులు పిండుకుంది.