రేపు నూజివీడులో పీజీఆర్ఎస్ కార్యక్రమం

రేపు నూజివీడులో పీజీఆర్ఎస్ కార్యక్రమం

ELR: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు పీజీఆర్ఎస్ నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో నేరుగా సమర్పించవచ్చని ఆమె ఇవాళ వెల్లడించారు. అందిన ప్రతి అర్జీని ఆన్‌లైన్‌లో నమోదు చేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చానట్లు పేర్కొన్నారు.