VIDEO: వైభవంగా శనీశ్వర స్వామి జయంతి

CTR: శనీశ్వర స్వామి జయంతి పర్వదినం సందర్భంగా మంగళవారం పుంగనూరు రూరల్ మండలం దండుపాళ్యం గ్రామ సమీపంలోని శనీశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయాన్నే అర్చకులు స్వామివారి శిలా విగ్రహానికి ఫల పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం శాంతి హోమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.