ఫుట్ పాత్ వ్యాపారాలపై దాడులు

ఫుట్ పాత్ వ్యాపారాలపై దాడులు

MDK: తూప్రాన్ పట్టణంలోని ఫుట్ పాత్ వ్యాపారాలపై మున్సిపల్ అధికారులు, సిబ్బంది దాడులు చేశారు. మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి, తూప్రాన్ ఎస్సై శివానందం, యాదగిరి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. రోడ్డుపై ఇబ్బందికరంగా దుకాణాలను ఏర్పాటు చేయరాదని సూచించారు. రోడ్లపై ఇబ్బందికరంగా దుకాణాలను ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.