BYPOLL: 11 చోట్ల EVMలు మొరాయింపు.!
HYD: జూబ్లీహిల్స్‌లో 11 పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించాయి. ప్రధానంగా రహమత్ నగర్ పరిధిలోని పోలింగ్ బూత్‌లు 165, 166, షేక్‌పేట డివిజన్‌లోని పోలింగ్ బూత్ -30లో ఈ సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ లోపాల కారణంగా ఆయా కేంద్రాలలో ఓటింగ్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక నిపుణుల బృందం కొత్త మెషీన్లు ఏర్పాటు చేయడంతో పోలింగ్ తిరిగి ప్రారంభమైంది.