TTDని వివాదాల్లోకి తీసుకురావాలని టీడీపీ ప్రయత్నం: అంబటి

GNTR: టీటీడీని తరచూ వివాదాల్లోకి తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. తాడేపల్లిలో గురువారం మాట్లాడుతూ.. టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు మాటల తీరు తిరుమల పవిత్రతకు భంగం కలిగించే విధంగా ఉందన్నారు. తిరుమల కొండపైకి వెళ్లినా ఆయన గోవింద నామస్మరణ మరచి దూషణలు, బూతులు మాట్లాడుతున్నారన్నారు.