VIDEO: ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద మృతదేహం లభ్యం
NLR: వింజమూరులోని రాఘవేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో రోడ్డు పక్కన కాలువలో ఇవాళ బైక్‌తో పాటు ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిని బుక్కాపురం గ్రామానికి చెందిన బద్వేలు శ్రీనివాసులు(44)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు.