జిల్లా రవాణా శాఖ అధికారికి సమ్మె నోటీసులు అందజేత

MHBD: ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా చేపట్టే కార్మిక సంఘాల సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు మానుకోట క్యాబ్ డ్రెవర్ల యూనియన్ TRCPTU (CITU) సభ్యులు తెలిపారు. ఈరోజు యూనియన్ ఆద్వర్యంలో జిల్లా రవాణాశాఖ అధికారికి సమ్మెనోటిసు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నదని, వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.