అసోంలో శాంతిని నెలకొల్పాం: అమిత్ షా
గత పదేళ్లలో అసోం శాంతిని నెలకొల్పినట్లు కేంద్రమంత్రి అమిత్ షా వెల్లడించారు. బోడో శాంతి ఒప్పందంతో పాటు కర్బీ ఆంగ్లాంద్ ఒప్పందం చేసుకున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఈ ఘనత బీజేపీకే దక్కుతుందని చెప్పారు. 80వ దశకం నుంచి అసోంను పాలించిన కాంగ్రెస్ ఈ ప్రాంతంలో అశాంతిని నెలకొల్పిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మరోసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.