అయోధ్యలో LSG టీమ్ సందడి

అయోధ్యలో LSG టీమ్ సందడి

ఐపీఎల్ ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అయోధ్య రామమందిరాన్ని సందర్శించింది. ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా కూడా జట్టు సభ్యులతో కలిసి బాలరాముడిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను యాజమాన్యం అధికారిక సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో లక్నో జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏప్రిల్ 1న తలపడనుంది.