ఉత్తీర్ణత సాధించని పాఠశాలలకు నోటీసులు

KRNL: పదో తరగతి తుది పరీక్షల్లో తప్పిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు సాధన చేయించాలని DEO శామ్యూల్ పాల్ అన్నారు. మంగళవారం ఆదోని డివిజన్ పరిధిలోని ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. పదివేల మంది విద్యార్థులు పరీక్షల్లో తప్పారన్నారు. 50 శాతం కన్నా తక్కువగా ఉత్తీర్ణత సాధించిన ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు నోటిసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.