నాకు భద్రత పెంచండి: తేజ్ ప్రతాప్ యాదవ్

నాకు భద్రత పెంచండి: తేజ్ ప్రతాప్ యాదవ్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రానికి జనశక్తి జనతా దళ్(JJD) చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ కీలక విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ నాయకులే లక్ష్యంగా దాడులు, హత్యాయత్నాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తనకు ముప్పు పొంచి ఉందని.. భద్రతను మరింత పెంచాలని కోరారు. అప్పుడే తను భయం లేకుండా ప్రచారం చేసుకోగలనని చెప్పారు.