ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన MLA

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన MLA

KRNL: ఎమ్మిగనూరు నూతన ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని మౌలిక వసతులు, వైద్య పరికరాలు, ఔషధ దుకాణాలను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి అధికారులు, వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.