ప్రజాపాలన కాదు.. రాక్షస పాలన
NZB: కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజా పాలన కాదని రాక్షస పాలన అని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీమ్‌గల్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 9 కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష ఫలించిన రోజు అని తెలిపారు. హైదరాబాదులో కేసీఆర్ సేకరించిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ వాళ్లకి ఇచ్చి వేలాది కోట్లు దొబ్బుకునే ప్రయత్నం చేస్తుందని సీఎంపై ఆయన విరుచుకుపడ్డారు.