సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ చాలా కీలకం: సిరాజ్
దక్షిణాఫ్రికాతో టీమిండియా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ భారత్‌కు చాలా కీలకమని బౌలర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. ప్రస్తుతం WTCలో భారత్ 3వ స్థానంలో ఉండగా, సౌతాఫ్రికా 2వ స్థానంలో ఉంది. టాప్-2లో చోటు దక్కించుకోవాలంటే ఈ సిరీస్‌లో విజయం సాధించడం ముఖ్యమని సిరాజ్ పేర్కొన్నాడు. గతేడాది, WTC ఛాంపియన్‌గా సౌతాఫ్రికా నిలిచింది.