కాలువ మూసివేతపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు

కాలువ మూసివేతపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు

MBNR: రాజాపూర్ మండలం గుండ్లపోట్లపల్లి గ్రామస్థులు శనివారం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని శనివారం కలిసి తమ సమస్యను వివరించారు. గ్రామంలోని పెద్ద చెరువు ఎడమ కాలువను మూసివేయడంతో చెరువుకు నీళ్లు రావడం లేదని, దీంతో తమ పంటలకు నీరందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విన్నవించారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని గ్రామస్థులు తెలిపారు.